అనురాగ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అకాడమిక్ కార్యక్రమం
ఘట్ కేసర్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన అంతర్జాతీయ అకాడమిక్ కార్యక్రమంలో జర్మనీకి చెందిన ప్రొఫెసర్ హైకే షిన్నెన్బర్గ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సంయుక్త సహకారంతో నిర్వహించబడింది. కార్యక్రమం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ విష్ణువందన ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ మాన్సూర్ పాషా, డాక్టర్ బి. రాజేశ్వరి, పద్మజ సమన్వయంతో నిర్వహించబడింది.
ఈకార్యక్రమంలో ఏఐ ఆధారిత బోధనా విధానాలపై ఫ్యాకల్టీ సెషన్తో పాటు, విద్యార్థులకు కెరీర్ ప్లానింగ్, డిజిటల్ యుగంలో నాయకత్వంపై ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన ఫ్యాకల్టీతో పాటు ఎంబీఏ, బిబిఏ విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం యొక్క అంతర్జాతీయ సహకారం, అకాడెమిక్ నాణ్యతకు నిదర్శనంగా నిలిచింది.




