10 April, 2026 | 1:58 AM

దేశ ప్రజల గుండె చప్పుడు కమ్యూనిస్టు పార్టీ సీపీఐ

10-04-2026 12:00 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : దేశ ప్రజల గుండె చప్పుడుగా సిపిఐ పార్టీ నిలుస్తుందని ఆపార్టీ ఘట్ కేసర్ డివిజన్ కార్యదర్శి లొట్టి ఈశ్వర్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో గురువారం గడప గడపకు సిపిఐ పార్టీ కరపత్రాల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి లొట్టి ఈశ్వర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరు జయచంద్ర మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో 142 కోట్ల మందికి సమసమాజ నిర్మాణానికి జరిగే మహా ఉద్యమంలో వేల వీర కిరణాలు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల పక్షం ప్రశ్నించే గొంతుకై దేశ స్వతంత్రం పోరాటంలో గాని ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నుకోబడి ఉన్నప్పుడు, లేనప్పుడు 140 కోట్ల మంది పక్షాన గొంతెత్తి నినాదించిన పార్టీ సిపిఐ అని పేర్కొన్నారు. 

ఉద్యోగ, ఆరోగ్యం,  ఇరిటేట్మెంట్ భద్రతలు అలాగే కార్మికుల యాక్ట్ 44 చట్టాలు రైతులకు భద్రత రైతు గిట్టుబాటు ధరలు కల్పించడంలో భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర ఎంతో గొప్పది అన్నారు. ఈ స్ఫూర్తితో ఇంటింటికి కరపత్రం ద్వారా ప్రజల దగ్గరకు వెళుతుందన్నారు. ఈకార్యక్రమంలో  మండల సిపిఐ నాయకులు సదాశివ, మురళి,  శ్రీనివాస్ చౌదరి, అంజి, మహేష్ గౌడ్, శ్యామ్,  తదితరులు పాల్గొన్నారు.