విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టాలి
నాయీ బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం
సంగారెడ్డి ,ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం నాయి పిలుపునిచ్చారు. గురువారం పట్టణ అధ్యక్షులు లకడారం మాణిక్ ప్రభు ఆదేశాల మేరకు కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని షాప్ టు షాప్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంఘం సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని అత్యధిక సంఖ్యలో చేయించాలని పేర్కొన్నారు. సంఘం బలం సభ్యులేనని, ప్రతీ సభ్యుడు క్షేత్రస్థాయిలో సంఘం సభ్యత్వం చేయించాలని అన్నారు.
అనంతరం కుల సభ్యుల చేత సభ్యత్వ నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెంటయ్య, సహాయ కార్యదర్శి రజోల్ ప్రభు, కార్యదర్శి మురారి, కోశాధికారులు శేఖర్, స్వాగత్ ప్రభు, యువత అధ్యక్షులు చరణ్, ప్రధాన కార్యదర్శి రాము, అనిల్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






