ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
నారాయణపేట. మార్చి 13 (విజయక్రాం తి): నారాయణ పేట జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గురువారం స్వ పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు కలెక్టర్, డీఈ ఓ, ఎంఈఓ, ఆచార్య మాతాజీలుగా వ్యవహరించారు. ఆచార్య మాతాజీలుగా విద్యార్థులు తరగతి గదుల్లో చక్కగా పాఠ్యాంశాలు బోధించి ఆకట్టుకున్నారు. స్వయం పాలన సందర్భంగా ఆ పాఠశాల చెందిన పదో తరగతి విద్యార్థులు ఆచార్య మాతాజీలుగా వ్యవహరించి, పదో తరగతి పాఠ్యాంశాలు బోధించి, విద్యార్థులకు వచ్చి న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేశారు.
ముఖ్యంగా పదో తరగతి విద్యార్థి విఘ్నహంత్ పదో తరగతి సాంఘిక శాస్త్రంలోని పాఠ్యాంశాన్ని భారత దేశ చిత్ర పటం ప్రదర్శించి మరీ బోధించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడు. చక్కటి బోధనకు గాను విద్యార్థి విఘ్నహంత్ ప్రథమ బహుమతిని పొందారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రబంధ కారిణి బృందం, పాఠశాల ప్రధాన ఆచార్యులు, ఆచార్య మాతా జీలు, విద్యార్థులు పాల్గొన్నారు.






