calender_icon.png 21 August, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతుర్ని లైంగికంగా వేధించిన తండ్రి.. నరికి చంపిన భార్య

27-06-2024 11:43:25 AM

సంగారెడ్డి జిల్లాలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే ఆ తండ్రి కన్నేశాడు. తన కామవాంచ తీర్చాలని వేధింపులకు గురిచేశాడు. తట్టుకోలేకపోయిన ఆమె తన తల్లికి విషయం చెప్పి బోరున విలపించింది. బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి కుమార్తెను లైంగికంగా వేధించాడు. కుమార్తెను వేధిస్తుండడంతో చూసి తట్టుకోలేకపోయిన భార్య గొడ్డలి తీసుకుని భర్తను నరికి హత్య చేసింది. అనంతరం తల్లీకూతురు పోలీస్ స్టేషన్ లో  లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.