18 June, 2026 | 10:38 AM

అనుమానాస్పదంగా దంపతుల మృతి

18-06-2026 09:38 AM

కారణాలపై పోలీసుల దర్యాప్తు

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి):  ఆసిఫాబాద్ మండలం కోసార గ్రామపంచాయతీ పరిధిలోని భవానీనగర్‌లో దంపతులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులు బానోత్ రాజు, అతని భార్య సునీతగా గుర్తించారు.ఇంట్లో దంపతులు మృతిచెందిన విషయం తెలియడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి ఆధారాలు సేకరించారు.

అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.దంపతుల మృతి వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.భవానీనగర్‌లో విషాదాన్ని నింపగా, దంపతుల మృతిపై స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మృతికి గల అసలు కారణాలను వెలికితీసేందుకు విచారణ చేపట్టారు.