19 August, 2026 | 7:21 PM

ఫోటోగ్రఫీ ఒక అద్భుతం

19-08-2026 06:37 PM

చిన్నచింతకుంట: స్థానిక శ్రీ రాఘవేంద్ర స్టూడియో వద్ద కేజీబీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ అనంత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల అసోసియేషన్ అధ్యక్షుడు బండారు పీటర్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అసోసియేషన్ ప్రతినిధులు రాఘవేందర్, సాగర్ రెడ్డి, శరత్ కుమార్, బాలు, జనార్ధన్, రఫీ తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.