లక్నో గెలుపు బాట పట్టేనా?
- ఆర్‌సీబీతో కీలక మ్యాచ్
- పంత్ కెప్టెన్సీకి పరీక్ష
లక్నో, మే 6 : ఐపీఎల్ 19వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్ల్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయిన ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు దాదాపుగా దూరమైంది. ప్రస్తుతం పాయిం ట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న లక్నో మిగిలిన అన్ని మ్యాచ్‌లూ గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమే. ఈ సీజన్ లో బ్యాటింగ్ వైఫల్యమే లక్నో పేలవ ప్రదర్శనకు కారణంగా చెప్పొచ్చు. మార్ష్, మాక్రర మ్, పంత్, నికోలస్ పూరన్ వంటి హార్డ్ హి ట్టర్లున్నా నిలకడగా రాణించడం లేదు.
కెప్టెన్ పంత్ అయితే ఈ సీజన్‌లో చెప్పకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. అటు సారథిగా నూ నిరాశ పరుస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌ల లో బ్యాటింగ్ పరంగా చేసిన ప్రయోగాలు కూడా లక్నో కొంపముంచాయి. ఈ నేపథ్యంలో బ్యాటర్లు గాడిన పడితే తప్ప లక్నో మళ్లీ గెలుపు బాట పట్టే అవకాశం లేదు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తున్నాడు. అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాద వ్, మోసిన్ ఖాన్ పేస్ త్రయం కూడా ఆకట్టుకుంటోంది. కీలక సమయాల్లో వికెట్లు తీస్తుండడం లక్నోకు అడ్వాంటేజ్.
అటు స్పిన్ విభాగంలో దిగ్వేశ్ సింగ్‌ను ఇంపాక్ట్ ప్లే యర్‌గా ఉపయోగించుకుంటున్నారు. ఆ యుశ్ బదోనీ కూడా స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. అయినప్పటకీ లక్నోకు విజయాలు అందడం లేదు. ఇప్పుడు ఆర్సీబీపై పూర్తిస్థాయిలో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిస్తే తప్ప లక్నో పరాజయాలకు బ్రేక్ పడడం కష్టమే. మరోవైపు గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ షాకిచ్చింది. ఆ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఓటమి రుచి చూపించింది.
ఈ మ్యాచ్ తర్వా త దాదాపు వారం రోజులు రిలాక్స్ అయిన ఆర్సీబీ లక్నోను ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. ఫిల్ సాల్ట్ దూరమవడం బెంగళూరుకు మైనస్ పాయింట్. కోహ్లీ, పడిక్కల్, పటిదార్ ఫామ్‌లో ఉండడంతో ఆర్సీబీ బ్యాటింగ్ బలంగానే ఉంది. జాకబ్ బెథల్‌తో పాటు జితేశ్ శర్మ, టిమ్ డేలిడ్, కృనాల్ పాండ్యా కూడా చెలరేగితే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో వెటరన్ భువనేశ్వర్ కుమార్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే హ్యాజిల్ వుడ్ సైతం అదరగొడుతున్నాడు. స్పిన్ విభాగంలో సు యాశ్ శర్మ, కృనాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
తుది జట్లు అంచనా
లక్నో సూపర్‌జెయింట్స్ : మార్ష్, మాక్రరమ్, పంత్(కెప్టెన్), ఇంగ్లీస్, పూరన్, రఘు వంశీ, హిమ్మత్ సింగ్, షమీ, మోసిన్ ఖాన్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : కోహ్లీ, బెథెల్, పడిక్కల్, పటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫ ర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, హ్యాజిల్‌వుడ్






