calender_icon.png 1 February, 2026 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్‌లో బిజీగా మారనుందా?

30-01-2026 12:00:00 AM

టాలీవుడ్‌లో శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చిన చెన్నై బ్యూటీ ప్రీతి ముకుందన్. ఆ సినిమా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. తర్వాత విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రంతో ప్రీతి ముకుందన్ కాస్త తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ, పాన్‌ఇండియా రిలీజ్ అయిన ఆ సినిమా.. ఆ స్థాయి గుర్తింపును ప్రీతికి తీసుకురాలేకపోయింది. ఆ సినిమా సక్సెస్ అయితే ప్రీతి కెరీర్ మరో విధంగా ఉండేది. అటు తమిళ, మలయాళ చిత్రసీమల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో ప్రీతికి అక్కడా నిరాశే మిగిలింది.

ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం కార్తీక్ ఆర్య న్ కథానాయకుడిగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కాగా, మరొకటి ‘నాగ్ జిల్లా’ అనే మరో సినిమా. ఈ రెండింటిలో ఒక సినిమా లో హీరోయిన్‌గా ప్రీతి ముకుం దన్‌ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీతితో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నా రు. రేపో మాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రీతి ముకుందన్.. ఏకంగా కార్తీక్ ఆర్యన్ ప్రాజెక్టులోనే ఛాన్స్ కొట్టేయడం విశేషం. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అతడి సరసన నటించిన హీరోయిన్లకు మంచి గుర్తింపు దక్కిం ది.

ఇకపై ప్రీతి ముకుందన్ కూడా అవకాశాలతో బిజీ అవుతుందన్న భావన అందరిలో వ్యక్తమవుతోం ది. అంతేకాకుండా ఇటీవల బాలీవుడ్‌లో దక్షిణాది భామల జోరు కొనసాగుతోంది. రష్మిక మందన్నా, సమంత, శ్రీలీల, కీర్తి సురేశ్ లాంటి వారికి బాలీవుడ్ మేకర్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జాబితాలో ప్రీతి ముకుందన్ కూడా చేరబోతోందన్న టాక్ నడుస్తోంది.