25 April, 2026 | 3:37 AM

సన్‌రైజర్స్ జోరు కొనసాగేనా?

25-04-2026 01:23 AM
  1. రాజస్థాన్ రాయల్స్‌తో ఢీ
  2. కమిన్స్ రీఎంట్రీ
  3. రివేంజ్‌పై కన్నేసిన రాజస్థాన్

జైపూర్, ఏప్రిల్ 24 : ఐపీఎల్ 19వ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇ ప్పుడు బయటి మ్యాచ్‌ల సవాల్‌కు రెడీ అయింది. సొంతగడ్డపై వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. జైపూర్ వేదికగా శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. హోంగ్రౌండ్‌లో వరుసగా సాధించిన విజయాలతో సన్‌రైజర్స్ పా యింట్ పట్టికలో దూసుకొచ్చింది.

ప్రస్తుతం 7 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయిం ట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , క్లాసెన్ అదరగొడుతున్నారు. ఆరంభ మ్యాచ్‌లలో నిరాశపరిచిన అభిషేక్ శర్మ ఢిల్లీ పై మాత్రం సెంచరీతో చెలరేగిపోయాడు. అలాగే క్లాసెన్ అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించిన కమిన్స్ రాజస్థాన్‌పై బరిలోకి దిగుతాడని తెలుస్తోంది.

దీంతో ఇషాన్ కిషన్ కీపర్ గానే కొనసాగుతాడు. బౌలింగ్‌లో కూడా సన్‌రైజర్స్ దు మ్మురేపుతోంది. హర్షల్ పటేల్, ఉనాద్కట్ పెద్దగా రాణించకున్నా యువ పేసర్లు సకీబ్ హొస్సేన్, ప్రఫుల్ హింగే అదరగొడుతున్నారు. ఎహసాన్ మలింగా సైతం సత్తా చాటుతున్నాడు. అయితే కమిన్స్ రాక తో ప్రఫుల్ పై వేటు అవకాశాలున్నాయి. స్పిన్నర్ శివాం గ్ కుమార్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా మళ్లీ గెలుపు బాట పట్టింది.

ఆరంభం లో వరుసగా నాలుగు విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్ తర్వా త వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిం ది. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌పై త క్కువ స్కోరు చేసినప్పటకీ అద్భుతమైన బౌలింగ్‌తో కాపాడు కుంది. కాగా సన్‌రైజర్స్ చేతిలో కూడా ఓట మి రుచి చూసిన రాజస్థాన్ ఇప్పుడు తమ హోంగ్రౌండ్ లో ప్రతీకా రం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. బ్యా టింగ్‌లో జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్‌కు ప్రధాన బలం.

వీరిచ్చే శుభారంభా లతోనే పలు విజయాలను అందుకుంది. గత రెండు మ్యాచ్‌ల లో వీరిద్దరూ నిరాశపరచడం కాస్త ఇబ్బందిగా మారింది. ఇప్పుడు హోంగ్రౌండ్‌లో మళ్లీ వీరిద్దరూ ఫామ్ అం దుకోవాలని ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్‌లో నిరాశపరుస్తున్నాడు. హెట్ మె యిర్ కూడా ఆడింది లేదు.

ఫెరీరా, జడేజా మాత్రం గత మ్యాచ్‌లో రా ణించారు. అటు బౌలింగ్‌లో ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ పేస్ విభాగంలో కీలకంగా ఉన్నారు. స్పిన్నర్లుగా జడేజా, రవి బిష్ణోయ్ సత్తా చాటుతు న్నారు. కాగా మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న జైపూర్ పిచ్ బాలెన్సింగ్‌గా ఉం టుందని అంచనా. 

తుది జట్లు అంచనా

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ రెడ్డి, కమిన్స్(కెప్టెన్), శివాంగ్ కుమా ర్, హర్ష్ దూబే, సకీబ్ హొస్సేన్, మలింగ

రాజస్థాన్ రాయల్స్ : జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, బర్గర్, సందీప్ శర్మ