11 August, 2026 | 2:04 AM

బీజేపీకి చెందిన బీసీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయాలి

11-08-2026 12:20 AM

బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు

సూర్యాపేట, ఆగస్టు ౧౦ (విజయక్రాంతి) : బీసీ బిల్లును షెడ్యూలు తొమ్మిది లో చేర్చకుండా బీసీలకు ద్రోహం చేసిన బిజెపి పార్టీకి చెందిన కేoద్ర మంత్రులు రాజ్యసభ సభ్యులు తక్షణమే నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాలళ ధనుంజయ నాయుడు అన్నారు. సోమవారం జిల్లా కేం ద్రంలోని బిసి హక్కుల సాధన సమితి కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకులతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు.

బీసీల పట్ల బిజెపికి ఎందుకు అంత అక్కసు అని, కేం ద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని ఎన్ని మార్లు కోరినప్పటికీ ఎందు కు పెడ చెవిన పెడుతున్నారన్నారు. జన గణనలో కులగణన చేపట్టాలని దేశవ్యాప్త ఉద్య మం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చల నం లేకుండా పోయిందన్నారు. జనాభా దాబాషా పద్ధతిలో రాజకీయ రిజర్వేషన్ ఏ ర్పాటు చేయాలని బడ్జెట్ లో కూడా జనా భా దాబాషా పద్ధతిలో నిధులు కేటాయించడం ద్వారా అన్ని కులాల వారికి స్వాతంత్ర ఫలాలు దక్కుతాయన్నారు.

ముఖ్యంగా ఇటీవల కాలంలో జన్ జీ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకొని విద్య, వై ద్యం, న్యాయం దేశ ప్రజలందరికీ ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బిజెపి షె డ్యూల్ తొమ్మిదిలో బీసీ బిల్లును చేర్చాలని అంతకంటే గత్యంతరం లేదని తెలంగాణ వ్యాప్తంగా అస్తిత్వ ఉద్యమాలు ఊపొందుకున్నాయన్నారు.

ఇవాళ్ళ బీసీలకు ప్రధాన శత్రువు బీజేపీ, బిఆర్‌ఎస్ అని వారికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తగుపాఠం నేర్పాలన్నారు. సమావేశానికి బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు దంతాల రాంబాబు అధ్యక్షత వహించగా సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ముత్యాల భాస్కర్, బెల్లంకొండ గోవింద్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, వల్లపు సైదులు, కొత్త సైదులు జాల సైదులు రాఘవ తదితరులు పాల్గొన్నారు.