21 May, 2026 | 5:06 AM

బిజిగిరి దర్గా అభివృద్ధికి కృషి చేస్తా

19-06-2024 01:00 AM
  • హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్, జూన్ 18 : బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని చాదర్ సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా రావాలని కోరుకున్నానని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు చేస్తానని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో జమ్మికుంట మున్సి పల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ప్యాక్స్ చైర్మన్ సంపత్, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్, కరీం తదితరులు పాల్గొన్నారు.