27 June, 2026 | 7:07 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం కాకపోతే మీ పార్టీని రద్దు చేసుకుంటారా?

15-05-2025 01:16 AM

బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందని, త్వరలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుందని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఖండించారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పై విషయం చిమ్మడం తప్ప మరో పనిలేదని మండిపడ్డారు.

ఎన్వీఎస్‌ఎ స్ ప్రభాకర్ చెప్పినట్టుగా జూన్ 2న కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనం కాకపోతే మీ పార్టీని రద్దు చేసుకుంటారా? అని అద్దంకి దయాకర్ సవా ల్ విసిరారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మాటలు నమ్మి, పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా అబద్ధాలను నిజమని నమ్మే పరిస్థితికి వచ్చారని ఆయన విమర్శించారు.