15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

నిధులిస్తారా.. మహారాష్ట్రలో కలుపుతారా?

31-07-2024 01:26 AM

బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీలో మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ ఉత్తర తెలం గాణపై లేదని.. తమపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, తన నియోజకవర్గానికి నిధులిస్తారా? లేకుంటే మహారాష్ట్రలో కలుపుతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మహారాష్ట్రలో కలిపినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

వెనుకబడిన ప్రాంతాలపై హౌజ్ కమిటీని వేయాలని డిమాండ్‌చేశారు. మిగతా జిల్లాల కంటే తమ జిల్లా తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌కు రైస్ మిల్లర్లు రూ.50 వేల కోట్లు బకాయిలు ఉన్నట్టు చెప్పిన ఆ శాఖ మంత్రి, అదే బడ్జెట్ ప్రసంగంలో మాత్రం రూ.3 వేల కోట్లు రికవరీ చేస్తున్నామని అనటం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. వార్ధా లేదా తుమ్మిడిహట్టీ వద్ద ప్రాజెక్టును నిర్మించవచ్చని, దీనికి బీజేపీ ఎమ్మెల్యేలు సహకారం అందిస్తామని చెప్పారు.