19 March, 2026 | 4:58 AM

విండీస్‌దే తొలి వన్డే

02-11-2024 12:00 AM

ఆంటిగ్వా: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.1 ఓవర్లలో 209 పరుగులకు కుప్పకూలింది. లివింగ్‌స్టోన్ (48) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ గుకేశ్ మోతీ 4 వికెట్లతో మెరిశాడు.

అనంతరం ఆటకు వరుణుడు అంతరాయం కలిగించడంతో విండీస్ టార్గెట్‌ను 35 ఓవర్లలో 157 పరుగులుగా నిర్దేశించారు. ఛేదనలో ధాటిగా ఆడిన విండీస్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఎవిన్ లూయిస్ (94) భారీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే నేడు జరగనుంది.