2 August, 2026 | 4:29 PM

లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు

03-09-2025 12:00 AM

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్,   సెప్టెంబర్ 2 : ఒక మహి ళను అపహారించి, అత్యాచారం చేసి, గర్భ వతిని చేసి, బెదిరించిన నేరాలలో జైలు శిక్షలను విదిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రత్రేక మహిళ కోర్టు జడ్జి హరీష మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు.. ఎర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన జంగం రాజశేఖర్ అదే గ్రామ నివా సురాలు మహిర్భూమికి వెల్లి వచ్చేట ప్పుడు కాపుకాసి ఆమెను అపహారించి ఒక కొట్టం లో పదేపదే అత్యాచారం చేశాడు.

కొన్నాళ్లకు ఆమె గర్భిణీ అయింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కారకుకులు ఎవరు ఏమిటి అనేది ఘర్షణకు దారితీసింది. సదరు మహిళ ఈ విషయం ఒకానొక సందర్భంలో రాజశేఖర్‌ను నీలదీయడంతో అతను ఆమె ను బెదిరించి నిజామాబాద్‌లోని తేజ హాస్పిటల్‌లో చేర్పించి బలవంతంగా అబా ర్షన్ చేయించాడు. పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం పది మంది సాక్షుల వాంగ్మూలాలు నమో దు చేసుకుని, పద్నాల్గు ధ్రువీకరించుకున్న పత్రాలు మార్క్ చేసుకుని,

అన్నిటిని అధ్యా యనం చేసిన అదనపు సెషన్స్ జడ్జి హరీష ముద్దాయిపై నేరారోపణలు రుజువు అయి నట్లు నిర్ధారించారు. భారత శిక్షస్కృతి సెక్షన్ 366 (అపహారించడం ) ప్రకారం ఏడు సంవత్సరాల జైలుశిక్ష ఐదు వేల రూపా యల జరిమానా, సెక్షన్ 376(2)(n ) ఒక మహిళపై పదే పదే అత్యాచారం చేయడంకు గాను పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా,సెక్షన్ 417 మోసం చేసినందుకు  ఒక సంవత్సరం జైలుశిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా, బెదిరింపులు చేసినందుకు రెండు సంవత్సరాల జైలుశిక్ష రూ. 5 వేల జరిమానా విధించారు.

బాధితురాలికి రూ.౫ లక్షల పరిహారానికి సిఫార్సు..

ముద్దాయి రాజశేఖర్ క్రూరత్వం మూలంగా బాధిత మహిళ శరీరక, మానసిక భాధలకు, వేదనలకు గురైనందున జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఐదు లక్షల రూ పాయల ఆర్థిక పరిహారం అందజేయాలని జడ్జి హరీష తమ తీర్పులో సిపార్సు చేశారు.