7 July, 2026 | 12:56 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

అంకిత భావంతో..

11-07-2024 12:05 AM

నభా నటేశ్.. దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందటంతో నభాకు అవకాశాలు వరుస కట్టాయి. అయితే, ఉన్నట్టుండీ ఈ భామ నిరుడు యాక్సిడెంట్‌కు గురైంది. చాలా సర్జరీలు జరగటంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ కారణంగా సినిమాలకు ఏడాది కాలం పాటు దూరమైంది. యాక్సిడెంట్‌తో ఓ రకమైన మెండ్ సెట్‌లోకి వెళ్లిపోయానని ఇటీవల చెప్పింది నభా. కెరీర్ చాలా పీక్స్‌లో ఉన్నప్పుడే ఇలా జరగటం బాధాకరమని, కోలుకొని మళ్లీ సినిమా ప్రపంచంలోకి రావటం అంత సులువైన విషయం కాదని పేర్కొంది.  ఫిట్‌నెస్ సాధించి ప్రియదర్శి ‘డార్లింగ్’తో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ నెల 19న ‘డార్లింగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరోవైపు ‘స్వయంభూ’ రెండో, మూడో భాగాలు ఉంటాయని వాటిల్లో నభా నటేశ్ నటించనున్నదని సమాచారం. ఏదేమైనా నటన పట్ల నభా నటేశ్‌కు ఉన్న అంకిత భావమే ఆమెకు మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయనేది ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నయినా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కూడా నిరూపించింది నభా నటేశ్.