27 July, 2026 | 12:05 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

‘రాను.. బొంబైకి’ సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్‌గా కొత్త సినిమా

01-06-2026 02:15 AM

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖి త (రాను బొంబైకి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సాV3‘. ఈ చిత్రా న్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆది వారం పూజా కార్యక్రమాల తో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే  మూవీ ఎలా ఉం టుంది అనేది క్లియర్‌గా తెలిసింది.

నేను హీరోయిన్‌గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్‌కు గ్యాప్ ఇ చ్చా. అయినా మంచి ఆల్బమ్ వస్తే తప్పకుండా చేస్తా. ఎ లాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం‘ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ - ‘మా లక్ష్మి కృష్ణ బ్యానర్‌పై గతంలో రైల్వే స్టేషన్ అనే చిత్రాన్ని రూపొందించాం. ఇప్పుడు ఈ బ్యానర్‌లో చేస్తున్న రెండో సినిమా ‘సాV3‘. ఈ టైటిల్ ఇలా పెట్టేందు కు ఓ కార ణం ఉంది. సా అంటే సావిత్రి హీ రోయిన్ పేరు. అలాగే వి అంటే వి జయ్ కుమార్ అంటే డీమోన్ పవ న్ పేరుంది.

3లో త్రివిక్రమ్ రాజు అంటే సామ్రాట్ చేస్తున్న క్యారెక్టర్. ‘సాV3‘ సినిమాను కంప్లీట్ చేశాక పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ పూజా కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టగలమో లే దో అని ముందే నిర్వహించలేదు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాఠధిస్తుందని నమ్మకంతో ఉ న్నాం’ అన్నారు. హీరోలు సామ్రా ట్, డీమోన్ పవన్, ప్రొడ్యూసర్ వి. విజయ కూడా మాట్లాడారు.