వెంకన్నస్వామి దయతో చాలా పెద్దోన్నైపోతా!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో హీరో సత్యదేవ్.. విజయ్‌కి అన్న పాత్ర పోషిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి శనివారం విడుదలైన ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను టీమ్ తిరుపతిలో ఏర్పాటుచేసింది.
ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఏడాది కాలంగా ‘కింగ్‌డమ్’ గురించి ఆలోచిస్తున్నా.. ఒక్కటే అనిపిస్తుంది. తిరుపతి వెంకన్న స్వామి నా పక్కన ఉండి నడిపిస్తే.. చాలా పెద్దోన్నైపోతా. ఆ స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులుంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తా” అన్నారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, “ఇందులో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషం. విజయ్ ఎంతో అంకితభావంతో పనిచేస్తారు. ‘కింగ్‌డమ్’ అందరికీ నచ్చుతుందని, మీ హృదయం లోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను” అన్నారు. నిర్మాత నాగవంశీ, టీమ్ పాల్గొన్నారు.






