మైసా మొదలైంది!
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ‘మైసా’ అనే టైటిల్‌తో రష్మిక ఫస్ట్‌లుక్ సైతం ఇటీవల విడుదలైంది. ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం కానున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా గోండ్ తెగల బ్యాక్‌డ్రాప్‌లో బలమైన భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్.
ఇందులో రష్మిక ఇంతకు ముందెన్నడూ శక్తిమంతమైన అవతార్‌లో కనిపించనుంది. తాజాగా ఆదివారం ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభ మైంది. ఈ కార్యక్రమానికి కోర్ టీమ్ హాజరయ్యారు. నిర్మాత డీ సురేశ్‌బాబు క్లాప్ కొట్టగా, రవికిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
హను రాఘవపూడి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేసి, ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. తొలి షెడ్యూల్‌లో రష్మిక టీమ్‌తో చేరనుంది. ఈ చిత్రానికి శ్రేయాస్ పీ కృష్ణ డీవోపీగా పనిచేస్తున్నారు. ఆయన ఇటీవల తమిళ స్టార్ సూర్య ‘రెట్రో’ సినిమాకు ఛాయాచిత్రగ్రాహకుడిగా పనిచేశారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ‘కల్కి 2898 ఏడీ’ ఫేమ్ ఆండి లాంగ్ డిజైన్ చేస్తున్నారు.






