ఓబీసీల ఐకమత్యంతోనే!
పుల్లెంల గణేష్ :
భారతీయ పౌర సమాజంలో ప్రస్తుతం అంతర్గతంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలల్లో అతి పెద్దది కుల గణనతో కూడిన జన గణన. ముఖ్యంగా బీసీ కులాల సమస్యలే నేడు దేశ సమస్యగా మరి శాశ్వత పరిష్కార మా ర్గం లేకుండా పోతుంది. అగ్రకుల పాలకవర్గాలు తరతరాలుగా బీసీల స్థితిగతులను మార్చడానికి ఇష్టపడడం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ స మకాలీన అంశాల్లో బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలనే అంశం విపరీతంగా చర్చకు వస్తున్నది.
అందుకు ప్రధాన కారణం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు అ నంతరం బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందు పరిచింది. అందులో భాగంగా ముందు సామాజిక వర్గాల వారీగా కుల గణన చేపట్టిన ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలు 56 శాతం, 18 శాతం ఎస్సీలు, 12 శాతం ఎస్టీ కులాలు ,15 శాతం అగ్రకులాలు ఉన్నాయని పేర్కొంది.
అయితే భారత రాజ్యాం గంలో 50 శాతం పైబడి రిజర్వేషన్లు దాటకూడదని ఎక్కడా లేనప్పటికీ ఇందిరా స హాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో(1992) ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు మించకూడ దని తీర్పునివ్వగా, నేడు స్థానిక సంస్థల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని వాదించడం వింతగా అనిపిస్తుంది. భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతుల సమ్మేళనం.
జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి వారి జనాభా ప్రకారం సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో స మాన వాట దక్కాలి అనేదే రాజ్యాంగంలో ఉంది. కుల, మత, సామాజిక రుగ్మతలని రూపు మాపడానికి సమ సమాజ నిర్మాణంలో భాగంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పొందుపరచబడం వాటి ఉద్దే శం తప్ప, ఆర్థికంగా వెనుకబడ్డారని నెపం తో రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ మౌలిక సూత్రానికి విరుద్ధం.
అయినప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా అగ్రకులాలని ఆకర్షించ డానికి 5 శాతం కూడా లేని అగ్రకుల పేద ల కోసం ఆర్థిక అంశాల పేదరికాన్ని జో డించి ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురావడం చర్చనీయాంశమైంది. అగ్రకులాల నుంచి ఎలాంటి సామాజిక రాజకీయ పో రాటాలు జరగనప్పటికీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి, ఒక విధంగా అణగారిన వర్గాల రిజర్వేషన్లు పెరగకుండా అడ్డుకట్ట వేసినట్లయిందన్నది వాస్తవం.
ఒత్తిడి తీసుకొస్తేనే
నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇస్తామని జీవో నంబర్ 9ను తీసుకొచ్చింది. కానీ ప్రభుత్వం తెచ్చి న జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ కే సు కొట్టేయడంతో చుక్కెదురైంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై సామాజిక, రాజకీయ పోరాటం చే సి పార్లమెంటు చట్టం ద్వారా 9వ షెడ్యూ ల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చేలా ఒత్తిడి తీసుకొని వచ్చి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక సామాజిక, రాజకీయ పోరాటం చేసే బీసీ సంఘాలు, నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై దృష్టి పెడుతున్నారే తప్ప.. విద్యా, ఉద్యోగ అంశాల్లో కూ డా అదే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎవరూ పోరాటం చేయకపోవడం విడ్డూ రం. అగ్రవర్ణ నాయకుల పెత్తనం మాయ లో పడి బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు సాధించుకోలేకపోయారన్నది వాస్తవం.
ఆ తర్వాత మండల కమిషన్ ఉద్యమంలో బీసీలు అధికంగా పాల్గొన్నప్పటికీ రిజర్వేషన్లు సాధించుకోవడంలో విఫలమయ్యారు. గతంలో మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని మా న్యశ్రీ కాన్షీరాం దాదాపు రెండు నెలల పాటు పార్లమెంట్ ముందు టెంట్ వేసుకొని ధర్నా చేయడం మూలంగా వి.పి.సిం గ్ ప్రభుత్వం ఓబీసీ లకు విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టం చేయడం గమనించాల్సిన అంశం.
అం దులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో ఉన్న బీసీ కులాలకు తగిన విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వగలుగుతున్నాయి. కానీ తమి ళనాడు రాష్ర్టం మాత్రమే జయలలిత ము ఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుతూ కేంద్ర ప్ర భుత్వంతో పోరాడి 69 శాతం రిజర్వేషన్లు సాధించుకొని రక్షణ కవచంలాంటి 9వ షెడ్యూల్లో చేర్పించుకోవడం గమనార్హం.
అసలు దోషులెవరు?
తమిళనాడు రాష్ర్టం మాదిరిగా తెలంగాణలో కూడా 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్స్ అంశాన్ని పెట్టించి బలమైన రక్షణ కవచం తీసుకురావాలని రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ పోరం అధ్యక్షులు చిరంజీవులు, బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ బీసీ 42 శాతం రిజర్వేషన్స్ సాధన సమితి పేరుతో బలమైన సామాజిక, రాజకీయ పోరాటాలు కొనసాగిస్తున్నారు.
నేడు బీసీ కుల సంఘాల ఆధ్వ ర్యంలో తెలంగాణ రాష్ర్ట బంద్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వ డం గొప్ప విషయం. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ర్టంలో ప్రధాన పార్టీలన్నీ తమ ఓట్లు, సీట్లు పెంచుకోవడానికి ఎన్ని రాజకీయ పోరాటాలైనా చేస్తాయి. కానీ బీసీల విద్యా, ఉ ద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం పార్టీలకు అతీతం గా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో మాత్రం ఎలాంటి ముందడుగు కనిపించదు.
కాబట్టి ఇందులో ఉన్న స త్యాన్ని గ్రహించి అగ్రకులా పార్టీ నాయకులపై ఆధారపడకుండా రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీ సమాజం స్వధర్మం తో స్వీయ రాజకీయ వేదికను ఏంచుకొని పోరాటం చేసిన తమ హక్కులను సాధించుకునేందుకు కృషి చేయాలి. మరి నేడు జరగబోయే రాష్ర్ట బంద్‌కు రాష్ర్టంలోని అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయంటే ఇక్కడ దోషి ఎవరు? నిర్దోషి ఎవరు? బీసీలకు శత్రువు ఎవరు? మిత్రువు ఎవరు అన్నది బీసీ సమాజం గ్రహించాల్సిన అవసరముంది.
మరో విచిత్రమైన అంశంమేంటం టే.. నేటి బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొంటున్నారు. ఇక్కడ బీసీ రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా! మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని శత్రువుగా చూపించడంలో మాత్రం రాష్ట్రంలోని కాం గ్రెస్, బీఆర్‌ఎస్ సహా వివిధ కులసంఘా లు విఫలమవుతున్నట్లుగా అనిపిస్తుంది.
కలసికట్టుగా పోరాడాలి
అలాంటప్పుడు రాష్ర్ట బంద్‌ను దేనికి వ్యతిరేకంగా పరిగణించాలి? హైకోర్టు, సు ప్రీంకోర్టు తీర్పులకు అభిముఖంగానా? రాజ్యాంగబద్ధమైన కోర్టులు టెక్నికల్ అం శాలు బలంగా లేనప్పుడు రాజ్యాంగానికి లోబడే న్యాయబద్ధమైన తీర్పులు ఇస్తా యి. కోర్టు పరీక్షలకు నిలబడి బలమైన చట్టం తీసుకురావాల్సిన బాధ్యత వివిధ రాజకీయ పార్టీలపై, ప్రభుత్వాలపై ఉంది. ఇకనైనా బీసీ సమాజం అగ్రకుల పాలన, వారి క్షుద్ర రాజకీయాలను గమనిస్తూ స్వీయ రాజకీయ పార్టీ వేదికగా రాజకీయాలు చేయాలి.
ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు వంటి బీసీ నాయకత్వం కలిగిన ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులాల ఆధ్వర్యంలో బలమైన నాయకత్వాన్ని నడిపించాల్సిన అవసరముంది. అగ్ర కులా లకు అభిముఖంగా బీసీల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యాన్ని, ఐక్యతని ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్రాల్లో బీసీల నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిం చినట్టవుతుంది. ఈ విషయాన్ని నేడు అణగారిన వర్గాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావంతు లు, సామాన్యుల సైతం గ్రహించాల్సిన అంశం.
వ్యాసకర్త సెల్: 9553041549






