06-12-2024 02:55:26 AM
సౌర వ్యవస్థలో వాతావరణ మార్పులే కారణం
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కర్టిన్ యూనివర్సిటీ బినార్ స్పేస్ ప్రోగ్రాం ద్వారా ప్రయో గించిన బినార్ బినార్ బినార్ ఉపగ్రహాలు భూవాతావరణంలో కాలిపోయాయి. వీటిని రెండు నెలల కిందటే ప్రయోగించగా.. అవి ఎందుకూ పనిరాకుం డా కాలిపోయాయి. ఈ ఘటన నవంబర్ మొదట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. సౌరవ్యవస్థలోని వాతావరణ మార్పులే ఈ ఘటనకు కారణంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సౌర ప్రయోగాలు చేసే వారిని వెనకడుగు వేసేలా చేస్తోంది. బినార్ అనగా నుంగార్ భాషలో “ఫైర్ బాల్” అని అర్థం. సూర్యుడి గురించి అధ్యయనం చేసే లక్ష్యంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి బినార్ అనే పేరును పెట్టారు. ఈ ప్రయోగాలు మాత్రమే కాకుండా యూనివర్సిటీ మరిన్ని సౌర ప్రయోగాలు చేసేందుకు కూడా ప్రణాళికలు రచించగా.. వాటిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఏదేని సోలార్ యాక్టివిటీని మనం చేపట్టినా కానీ అవి 11 సంవత్సరాల వరకు ఉంటాయి. కానీ ఈ ప్రయోగం మాత్రం కేవలం రెండు నెలల్లోనే ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం విచారకరం.
2021లో ప్రయోగం..
బినార్ ఉపగ్రహాన్ని 2021లో ప్రయోగించగా.. అది సౌరవ్యవస్థలో 364 రోజుల పాటు నెట్టుకు రాగలిగింది. కానీ దాని తర్వాత చేసిన ప్రయోగాలు మాత్రం సౌరవ్యవస్థ ధాటికి తట్టుకోలేక కేవలం రెండు నెలల్లోనే ఢమాల్ అన్నాయి. బినార్ స్పేస్ ప్రోగ్రాం ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘బినార్ 3, 4 ఇలా అర్ధాంతరంగా పేలిపోవడం సౌరవ్యవస్థలో ఉన్న సవాళ్లను తెలియజేస్తుంది. ఉపగ్రహ మిషన్లపై సౌర వ్యవస్థ ప్రభావాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన రుజువు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాలను ప్రయోగించాలని అనుకునే వారికి ఇది అతిపెద్ద సవాల్’ అని అన్నారు.
ఇలా అనుకోని ఘటన జరిగినా కానీ కర్టిన్ విశ్వవిద్యాలయం బినార్ స్పేస్ ప్రోగ్రాం మాత్రం నిరాటంకంగా కొనసాగుతుందట. భవిష్యత్‌లో క్యూబ్‌శాట్ ప్రయో గాల కోసం యూనివర్సిటీ ఇప్పటికే పలు ప్రణాళికలను రచించింది.