15-10-2025 07:50:12 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ మండలంలో ఓగోడు మాదారం రహదారిలో గుర్తుతెలియని వ్యక్తి మహిళపై దాడి చేసి బంగారు గొలుసులు వెతికెళ్లిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ(60) తన భూమికి సంబంధించినపని నిమిత్తం మాదారం గ్రామానికి వెళుతుండగా లిఫ్ట్ ఇచ్చి స్కూటీపై ఆమెను అతని వాహనంపై ఎక్కించుకొని మార్గమధ్యలో ఆపి ఆమెపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న ఐదు తులాల బంగారు గొలుసు దోచుకెళ్లాడు.
ఈ ఘటనలో ఆవుల సావిత్రమ్మకు గాయాలు కావడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఘటనతో బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలుపారు.