16 April, 2026 | 11:56 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజరుపల్లిలో శివాజీ విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ

19-02-2026 03:55 PM

లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజరు పల్లి లో శివాజీ విగ్రహాల ఏర్పాటుకు  భూమి పూజ

గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులోని లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజరుపల్లి గ్రామాలలో మాజీ సర్పంచ్ కొలిచెలిని స్వామి ఆధ్వర్యంలో శివాజీ విగ్రహా(Shivaji statues) ఏర్పాటుకు 11వ వార్డు కౌన్సిలర్ కొలిచెలిమి  భవాని కరుణాకర్  కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఇరు గ్రామాలలో ప్రజలు కోరుకున్న విధంగా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్వామి తెలిపారు. హిందుత్వాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు తనకు అవకాశం కలగడం ఎంతో అదృష్టమని తనకు అవకాశాన్ని ఇచ్చినందుకు  ఆయా గ్రామస్తులకు  మాజీ సర్పంచ్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.