15-10-2025 07:47:39 PM
యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డ
ముగిసిన ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరము
పటాన్ చెరు: జాతి నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని యువ నాయకులు ఎం.హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మహిళా డిగ్రీ కళాశాల బేగంపేట హైదరాబాద్ జాతీయ సేవా పథకం చైర్మన్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె పద్మావతి, యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీ.నరసింహులు, యూనిట్ 3 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.మధుకర్ రావు ల ఆధ్వర్యంలో ఏడవ రోజు ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరము ముగిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఐనోల్ మండల పరిషత్ ప్రాథమిక ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థి దశ ఉన్నతమైనదని, ఇటువంటి ఎన్ఎస్ఎస్ శిబిరాలకు హాజరు కావడం వల్ల గ్రామీణ ప్రాంత సమస్యల పట్ల అవగాహనతో సమాజాభివృద్ధికి, సామాజిక మార్పునకు జ్ఞాన సముపార్జనకు ఎక్కువ సమయం కేటాయించాలని తెలిపారు.
ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చినందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ప్రమీల మాట్లాడుతూ.. విద్యార్థులు సేవా దృక్పథం ఆలవర్చుకోవడం వల్ల తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని సూచించారు. పెద్ద కoజర్ల జెడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులు సంగ్శెట్టి మాట్లాడుతూ.. విద్యార్థులు కఠిన శ్రమ ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని, అందుకు ఇటువంటి కార్యక్రమాలు దోదపడతాయని చెప్పారు. స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజం పట్ల దేశం పట్ల అభిమానంతో జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.