calender_icon.png 12 November, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి

01-08-2024 01:10:32 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాముస్తాబాద్ మండలం, సేవాలాల్ తండా గ్రామంలో బట్టోనితాళ్లలో వృద్ధురాలు పిట్ల రాజ్యలక్ష్మి (80) పై కుక్కలు దారుణంగా దాడి చేశాయి. అర్ధరాత్రి ఇంట్లో కుక్కలు చొరబడి వృద్ధురాలి శరీరాన్ని భయంకరంగా కొరికేశాయి. ఈ ఘటనలో వృద్ధురాలి తల, శరీర భాగాలు ఎక్కడికక్కడే చిందర వందరగా పడిఉన్నాయి. కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిట్ల రాజలక్మి( 80) అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో పిచ్చి కుక్కలు ఇంట్లో ప్రవేశించి రాజ్యలక్ష్మి పై గుంపుగా దాడి చేశాయి. మొదటగా గొంతు పై దాడి చేసి చంపి రాజ్యలక్ష్మి శరీరంలో అవయవాలు పిచ్చి కుక్కలకు తిన్నాయి. ఉదయం స్థానికులు చూసే సరికి రాజలక్మి తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. రాజలక్మి మరణ వార్తతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.