7 May, 2026 | 2:06 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

చికిత్స పొందుతూ మహిళ మృతి

03-03-2026 07:24 PM

పాపన్నపేట: పురుగు మందు తాగి చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిన్న దుర్గాభవాని(24) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. తరచూ అనారోగ్య విషయమై ఇంట్లో బాధపడుతూ ఉండేది. గత నెల 27న రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగింది.

ఈ క్రమంలో కుటుంబీకులు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.