7 May, 2026 | 3:13 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

బొప్పస్‌పల్లిలో ఆంజనేయస్వామి ఆలయానికి శంకుస్థాపన

03-03-2026 07:20 PM

రామ్ రామ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు సన్నాహాలు వేగం

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు నాయకుల ఆహ్వానం

బాన్సువాడ,(విజయక్రాంతి): ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి బాన్సువాడ ఇన్‌చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ ను మంగళవారం నిజామాబాద్ లోని ఆయన స్వగృహంలో నసురుల్లాబాద్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పస్‌పల్లి గ్రామంలో ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు నిర్వహించనున్న ఆంజనేయస్వామి గుడి శంకుస్థాపనతో పాటు లంబాడీల ఆరాధ్య దైవం రామ్ రామ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు టేకర్ల సాయిలు, లక్ష్మణ్, చౌహాన్, దొంతి భాస్కర్, మామిడి భూమయ్య, కేతావత్ బాబు, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.