6 April, 2026 | 5:50 PM

ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి

06-04-2026 04:28 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని మర్థణపేట గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తకొండ దేవవ్వ (53) అనే ఒంటరి మహిళ ఉపాధి హామీ పనులకు వెళ్లి పని చేస్తుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలింది. సహచర కార్మికులు గమనించి వెంటనే ఆమెను పైకి లేపి చికిత్స కోసం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. దేవవ్వ ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉపాధి హామీ పనుల ద్వారా జీవనోపాధి పొందుతూ ఉండేది. ఆమె ఆకస్మిక మృతితో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. గ్రామస్థులు ప్రభుత్వంచే బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.