వ్యక్తిగత విభేదాలతో మహిళ హత్య..
పోలీసుల అదుపులో నిందితుడు
రూరల్ పోలీసుల చాకచక్యంతో హత్య కేసు ఛేదన.. వైరా ఏసీపీ సారంగపాణి
మధిర, మే20 (విజయక్రాంతి): మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామం ఓపెన్ వెంచర్ ప్రాంతంలో 15.05.2026 తేదీన జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వైరా ఏసీపీ సారంగపాణి విలేకరుల సమావేశంలో తెలిపారు.
మృతురాలు గోపిశెట్టి కల్పనను వ్యక్తిగత సంబంధాల వివాదం నేపథ్యంలో యార్లగడ్డ అంకుశరావు అలియాస్ చెన్నారావు చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మధిర సీఐ డి. మధు, ఎస్‌ఐ బి. లక్ష్మీ భార్గవి కేసును ఛేదించారు.
ప్రజలకు పోలీసుల సూచనలు..
వ్యక్తిగత సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బెదిరింపులు, వేధింపులు ఎదురైతే వెంటనే కుటుంబ సభ్యులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఏకాంత ప్రాంతాలకు వెళ్లడం, వ్యక్తిగత వివాదాలను తీవ్ర స్థాయికి తీసుకెళ్లే పరిస్థితులను నివారించాలి. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలు తలెత్తినప్పుడు చట్టపరమైన సహాయం తీసుకోవాలని పోలీసులు సూచించారు.






