21 May, 2026 | 2:33 AM

సీసీరోడ్డు పనులు పూర్తి చేయాలి

21-05-2026 12:18 AM

బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి 

బంజారాహిల్స్, మే 20(విజయక్రాంతి): ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ డివిజన్ ఉదయ్‌నగర్‌లో చేపట్టిన సీసీరోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో పరిసరాల్లోని నివాసితులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. తమ ఇంటి నుంచి రాకపోకలు సాగించేందుకు ఇదొక్కటే ప్రధానదారి కావడంతో వచ్చిపోయేదేలా అని వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు అవస్థలు తప్పడం లేదు.

విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ ఇన్‌చార్జీ మన్నె గోవర్ధన్ రెడ్డి ఉదయ్‌నగర్ కాలనీలో బుధవారం పర్యటించారు. డ్రైనేజీ నాలాపై నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను పరిశీలించారు. పనులు అసంపూర్తిగా ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

వీలైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే పనుల్లో జాప్యం చేయడం ఏంటని అధికారులను నిలదీశారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే బస్తీవాసులతో కలిసి జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారులు మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికుల సమ్మె కారణంగా పనులు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు.