6 May, 2026 | 9:15 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

గజ్వేల్‌లో మహిళ హత్య, భర్తపై దాడి

10-03-2025 10:37 AM

హైదరాబాద్: గజ్వేల్ మండలం రిమ్మనగూడ(Rimmanaguda, Gajwel Mandal)లో సోమవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి ఒక మహిళను దారుణంగా హత్య చేశాడు. బాధితురాలిని అస్రా (32)గా గుర్తించారు. దాడి సమయంలో ఆమె భర్త సాదత్ ఆమెను కాపాడటానికి ప్రయత్నించినప్పుడు, నిందితుడు అతనిపై కూడా దాడి చేశాడు. నిందితుడు అక్కడి నుండి పారిపోవడంతో సాదత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధితుడి సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.