6 May, 2026 | 10:00 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి

10-03-2025 11:01 AM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న లలిత్య (13) మూర్ఛ వ్యాధి కారణంగా మరణించినట్లు సమాచారం. లలిత్య బజార్‌హత్నూర్ మండలంలోని మోర్కండి గ్రామానికి చెందినది. ఆమె హాస్టల్‌లో మృతి చెందిందని పాఠశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లమని కోరారు.

పాఠశాలకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం(Principal's negligence) వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేశారు. తమ కుమార్తెను కోల్పోయినందుకు పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసన తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.