10 July, 2026 | 1:52 AM

మత్తు పదార్థం తాగించి మహిళపై లైంగిక దాడి

10-07-2026 12:13 AM

ఘట్ కేసర్, జూలై 9 (విజయక్రాంతి) : ఓ మహిళకు బాటిల్లో మత్తు పదార్థం కలిపి తాపించి స్పృహ కోల్పోయిన తర్వాత  అత్యాచారం చేసిన సంఘటన పోచారం ఐ టి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఒక మహిళ  భరత్ నగర్ ఉప్ప ల్ లో ప్యాసింజర్ ఆటో ఎక్కి హాస్పటల్ కి తీసుకుపొమ్మని చెప్పగా,  అట్టి ఆటో డ్రైవర్ భరత్ నగర్ లో గల తాటికల్లు డిపోకు తీసుకువెళ్లి అక్కడ కళ్ళు పార్సెల్ తీసుకొని ఘ ట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు నుం చి దూరంగా తీసుకువెళ్లి అట్టి మహిళ కు  బాటిల్లో మత్తు పదార్థం కలిపి తాపించి స్పృహ కోల్పోయిన తర్వాత ఆ మహిళ ను అత్యాచారం చేశాడు.

అనంతరం ఆమె దగ్గర గల సెల్ ఫోన్, కొంత నగదును తీసుకొని ఆమెను అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. ఆ మహిళ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పం దించి కేసు నమోదు చేసి మల్కాజిగిరి సిపి సుమతి ఆదేశాల మేరకు ఉప్పల్ జోన్ డిసి పి కె. సురేష్ కుమార్ ఐపీఎస్  పర్యవేక్షణలో మేడిపల్లి డివిజన్ ఏసిపి బి. మోహన్ కుమార్ సూపర్ విజన్ లో  పోచారం ఐటీ కారిడార్ సీఐ కనకయ్య గౌడ్ టీమ్ అయిన క్రైమ్ ఎస్‌ఐ కె. రాజు, హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుల్ విష్ణు , హోంగార్డు శ్రీనులు కలిసి 24 గంటల లోనే అనగా గురువారం సాయంత్రం 4:00 గంటల స మయంలో  నిందితుడు అయిన ఆంగోతు జేత్య ను అన్నోజిగూడ లో అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి ఒక ఆటో, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం పరుచుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు.