10 July, 2026 | 2:42 AM

రెండవ వార్డులో ఎన్యూమరేషన్ కేంద్రాన్ని సందర్శించిన తహసీల్దార్

10-07-2026 01:50 AM

బాన్సువాడ, జూలై 9 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రెండవ వార్డ్ కోట గల్లీలో గురువారం సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ కేంద్రాన్ని తహసిల్దార్ రాజా నరేందర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఓటర్ నమోదు జాబితాలో ఎంతమంది ఎన్యూమరేషన్ పారాలు సేకరించారు, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి.

బిఎల్‌ఓ లను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితా పారాలను అందజేసి ఎన్యుమరేషన్ పారాలలో నమోదు చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బిఎల్‌ఓ లకు ఆదేశించారు. ఆయన వెంట 2వ వార్డ్ కౌన్సిలర్ జంగం రాజశేఖర్, బిఎల్‌ఓ లక్ష్మి ఉన్నారు.