10 July, 2026 | 1:04 AM

అభివృద్ధికి నిరంతరం కృషి

10-07-2026 12:08 AM

చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ 

శంకర్‌పల్లి: జూలై 9( విజయ క్రాంతి): మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డులో 10 లక్షల నిధులతో అండర్ డ్రైనేజ్ పనుల ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధి కోసం ప్రభు త్వం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకొస్తామన్ననారు. ప్రజలు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆనందరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.