27 July, 2026 | 6:30 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

సరోగసీ కోసం వచ్చి.. అనంతలోకాలకు

27-11-2024 03:13 PM

హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గంలోని ఓ అపార్ట్ మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి మహిళ ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే... సరోగసీ కోసం ఒడిశా నుంచి నెల క్రితం వివాహిత(25) వచ్చింది. రాజేష్(55) సరోగసీ కోసం ఒడిశా మహిళలతో ఒప్పందం చేసుకున్నాడు. బిడ్డను కని ఇచ్చేందుకు రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నెల రోజులుగా ఒడిశా మహిళను రాజేష్ బయటకు వెళ్లనివ్వలేదు. దీంతో సోమవారం రాత్రి 9వ అంతస్తు నుంచి ఒడిశా మహిళ కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒడిశా మహిళ భర్త ఫిర్యాదుతో రాజేష్ బాబు పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేష్ లైంగిక వేధింపులతోనే భవనం పై నుంచి దూకినట్లు భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు.