ఏసీపీకి రాఖీ కట్టిన మహిళా కానిస్టేబుల్స్
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 28 (విజయక్రా ంతి): ఇబ్రహీంపట్నం మండలంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అ న్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు పరస్పరం రా ఖీలు కట్టుకుని ప్రేమానురాగాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ మహిళ కానిస్టేబుళ్లు డివిజన్ ఏసిపి కెపివి రాజు కి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
తోబుట్టువుల మధ్య ఆప్యాయత, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను స్టేషన్ అధికారులు, సిబ్బంది ఒకే కుటుంబ సభ్యుల్లా ఉత్సాహంగా జరుపుకున్నారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఏసిపి కెపివి రాజు, తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






