8 March, 2026 | 2:32 AM

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

08-03-2026 12:52 AM

హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, మార్చి 7(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బండారు వైష్ణవ్ మెమోరియ ల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుక లను శనివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో నిర్వహించారు. న్యాయమూర్తి మాధవి లత, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, సునైనా సింగ్, ఇఫ్లూ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్,  రమాదేవి, దీప్తి వాజపేయి టీవీ 9 సహా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురు మహిళా ప్రతిభావంతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మహిళల సాధికారత, సమానత్వం గురించి ప్రస్తావిస్తూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతు న్నారని, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయ న అన్నారు. సమాజంలోని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, మహిళలు సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు వురు ప్రముఖులు, మహిళా నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.