మహిళా రక్షణ మగవారి బాధ్యత
- ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ప్రశ్నించే తత్వం యువతలో రావాలి
- వారి రక్షణకు మగవారే బ్రాండ్ అంబాసిడర్లు
- మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రతకు ప్రభుత్వం పెద్దపీట
- సీఎం రేవంత్‌రెడ్డి
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూలో ‘స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్’
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి): సమాజంలో మహిళల రక్షణ కేవలం చట్టాలు, పోలీసుల పని మాత్రమే కాదని, ప్రతి మగవాడి సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. మహిళల భద్రత కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూ క్యాంపస్ ఆడిటోరి యంలో తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్‌ను సీఎం ప్రారంభించారు. స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సభలో ము ఖ్యమంత్రి యువతకు దిశానిర్దేశం చేస్తూ.. ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బందికి గురిచేసినప్పుడు, వేధిస్తున్నప్పుడు ధైర్యంగా నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూ చించారు. ‘వేధింపులను చూసీచూడనట్టు వదిలేయడం, మౌనంగా ఉండటం కూడా ఆ నేరాన్ని పరోక్షంగా ప్రోత్సహించడమే అవుతుంది. ఏదైనా జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు అని నిందలు వేసే చెడు సంప్రదాయాన్ని మనం ఇకనైనా వదులుకోవాలి.
ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం ప్రతి పురుషుడు స్టాండ్ విత్ హర్ నినాదంతో అండగా నిలబడాలి’ అని హితవు పలికారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడడంలో పురుషులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విమెన్ సేఫ్టీ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
మహిళలు అభద్రతాభావంతో బతకకూడదు
‘మహిళను మనం ఆదిశక్తితో పోల్చు తాం. కుటుంబ గౌరవంగా భావిస్తాం. అ లాంటి మహిళలు నిత్యం అభద్రతా భా వంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదు. ఈ దుస్థితిని నివారించేలా సమాజం, ముఖ్యంగా పురుషులు తమను తాము సవరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశా రు. మహిళ అయిన సోనియాగాంధీ సారథ్యంలో ఉన్న పార్టీయే ఇప్పుడు తెలంగా ణలో ప్రభుత్వాన్ని నడుపుతోందని,
దేశ స్వతంత్రానికి ముందు, ఆ తర్వాత కూడా మహిళలకు కీలక పదవులు కట్టబెట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులోనూ మహిళామణులే కీలకంగా వ్యవహరించారని, వారి శక్తిసామర్థ్యాల పట్ల తమ ప్రభుత్వానికి బలమైన న మ్మకం ఉందన్నారు. ఆడబిడ్డలు సామాజికం గా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం పు రోగతి సాధించినట్టుగా భావించాలన్నారు.
ఆర్థిక స్వావలంబన దిశగా..
తెలంగాణలో ఒకవైపు మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, మరోవైపు వారి ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నామని చెప్పారు. మహిళలను ఏకంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, ఆర్టీసీ బస్సులకు యజమానులను చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా అమెజాన్ వంటి గ్లోబల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.
తెలంగాణ విజన్ 2047కి వారే ఆధారం
తెలంగాణ రైజింగ్ విజ న్ లక్ష్య సాధనలో మహిళల ముందడుగే అత్యంత కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడంతోనే తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడంతోనే ఇవన్నీ సాకారం అవుతాయన్నారు. గతంలో భౌతిక దాడులు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు జరిగేవని, కానీ నేటి డిజిటల్ యుగంలో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్లైన్ క్రైమ్ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ము ఖ్యంగా డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైందని, వీటిని కఠినంగా ని యంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని టీఎస్సీఎస్బీ మరిం త పటిష్టం చేశామని వివరించారు. కార్యక్రమంలో సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, డీజీపీ శివధ ర్‌రెడ్డి, విమెన్ సేఫ్టీ విభాగం అడిషనల్ డీజీపీ చారు సిన్హా, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు.




