5 May, 2026 | 7:07 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

సాధికారత కోసం మహిళలు పోరాడాలి

13-03-2026 12:00 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): చట్టసభల్లో అన్ని వర్గాల మహిళల కు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పించే వరకు పోరాడి సాధించాలని, అప్పుడే మహిళా సాధికారత లభిస్తుం దని బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ఖైరతాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో బీసీ మహిళా సంక్షేమ సంఘం,

బీసీ ఉద్యోగుల మహిళా సంఘం సయుంక్త ఆధ్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలు సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల మహిళలకు అందులో సబ్ కోట కల్పించకపోవడం చాలా అన్యాయం అన్నారు. బీసీ మహిళా సం ఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమ మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతూనే మీకు ఒక వైపు పోటీ ప్రపంచం పురుషులతో సమానంగా ఎదగడానికి సమాజంలో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని, ఆత్మవిశ్వాసం, రాజకీయ లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అత్యం త ప్రతిభ కనబరిచిన 40 మంది మహిళ నేతలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీ దుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇం జనీరింగ్ చైర్మన్ డాక్టర్ రమణ నాయక్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్, బీసీ మహిళ నేతలు రాధా రాణి, తారకేశ్వరి, జ్యోతి, సమతా యాదవ్, సంధ్యా ణి, సుజాత, ఉమాదేవి, మీనా, సరిత, విజయ లక్ష్మి, రేణుక పాల్గొన్నారు.