5 May, 2026 | 8:34 PM

Breaking News

మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •  

మహిళా జన్ సున్వాయ్

13-03-2026 12:00 AM
  1. మల్కాజిగిరి సీపీ కార్యాలయలో నిర్వహణ
  2. జాతీయ చైర్‌పర్సన్ విజయ రహత్కర్, డీజీపీ శివధర్‌రెడ్డి హాజరు

మేడ్చల్, మార్చి 12 (విజయ క్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మహి ళా జన్ సున్వాయ్ కార్యక్రమానికి జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్, డీజీపీ శివధర్‌రెడ్డి, అడిషనల్ డీజీపీ చారుసిన్హా, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి, మల్కాజిగిరి సీపీ అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ రహత్కర్ మాట్లాడుతూ.. జాతీయ మహిళా కమిషన్, స్థానిక యంత్రాంగం కలిసి పనిచేస్తే మహిళల సమస్యలకు ఖచ్చితంగా త్వర గా న్యాయం జరుగుతుందన్నారు. దేశం న లుమూలల నుండి ఎన్నో ఫిర్యాదులు అం దుతుంటాయని, కానీ చాలా మంది మహిళలు ఢిల్లీ వరకు రాలేరని, అందుకే మేమే వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకొని ’జాతీయ మహిళా కమిషన్ మీ చెంతకు’ అనే ఈ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటివరకు మేము దాదాపు 100 జన సున్వాయ్ కార్యక్రమాలను పూర్తి చేశామన్నారు.

మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకేసారి దేశవ్యాప్తంగా సుమారు 500 జిల్లాల్లో ఈ విచారణలు నిర్వహించాలని నిర్ణయింకొని, దీని ద్వారా సుమారు 15 నుండి 20 వేల కేసులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మల్కాజిగిరిలో 30 కేసుల హియరింగ్ జరిగింద న్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఆర్డిఓ శ్యాంప్రకాష్, ఎంఆర్‌ఓ సీతారాం, డిడబ్ల్యూఓ శారద, డిఆర్డిఓ సాంబశివరావు, డిఎం అండ్ హెచ్‌ఓ ఉమాగౌరి, జిల్లా మైనారిటి అధికారి కాంతమ్మ, జిల్లా హౌజింగ్ అధికారి రమణమూర్తి పాల్గొన్నారు.