మహిళా @ 7 పుస్తకాలు చదవాల్సిందే!
తరతరాలుగా చాలామంది మహిళలు ఇంటి పనికే పరిమితమై ఉన్నారు. ఇంటి పనికే కాదు చాలా నిర్లక్ష్యానికి గురయ్యారు. నేటికీ పబ్లిక్‌లో ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. వారి కనీస అవసరాల కోసం ఇతరులపై ఆధారపడి జీవించాల్సి వస్తోంది. ఏది ఏమైనప్పటికీ మనది పితృస్వామ్య సమాజం. అలాంటి నియంత్రణను బద్దలుగొట్టి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మాహిళలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సాహిత్య ప్రపంచంలో మహిళా రచయితలు సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నారు. చరిత్రను మార్చలేనప్పటికీ, వాటి తాలుకు కథలను, నవలలను రికార్డు చేసుకొవొచ్చు. అలాంటి స్ఫూర్తిదాయకమైన రచనలను ప్రతి మహిళా తప్పక ఒక్కసరైనా చదవాలి.. అవేంటో చూద్దాం..
మార్గరెట్ అట్‌వుడ్
మార్గరెట్ కెనడియన్ కవయిత్రి, నవలా రచయిత, విమర్శకురాలు, వ్యాసకర్త. ఆమె రాసిన ‘ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్’ అనే పుస్తకానికి ప్రసిద్ధి చెందింది. ఈ నవల పితృస్వామ్య సమాజంలో అణచివేయబడిన స్త్రీల చుట్టూ ఉన్న ఇతివృత్తాలను అన్వేషించే విషాదభరితమైన సమాజం గురించి ఉంటుంది.
ఝుంపా లాహిరి
పులిట్జర్ బహుమతి పొందిన నవలా రచయిత్రి లాహిరి. ఆమె చిన్న కథలు, నవలలు, వ్యాసాలకు ప్రసిద్ధి చెందింది. 1999లో ప్రచురించబడిన ‘ది ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మలాడీస్’ అనే చిన్న కథల సంకలనంతో రచనలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మూడు పుస్తకాలైన ‘ది నేమ్ సేక్’, ‘అన్‌కస్టమ్డ్ ఎర్త్’, ‘ది లోలాండ్’ వంటి కథలు, నవలలు
పాఠకులతో ప్రశంసలు పొందాయి.
మాయా ఏంజెలో
మాయా ఒక అమెరికన్ కవి, గాయని, రచయిత, పౌర హక్కుల కార్యకర్త. ఆమె ఒక స్ట్రీట్ కార్ డ్రైవర్‌గా, నైట్ క్లబ్ పెర్ఫార్మర్‌గా, సెక్స్ వర్కర్‌గా, జర్నలిస్ట్‌గా పని చేసింది. మాయ రాసిన వాటిలో ‘ఐ నో వై ది కేజ్డ్ బర్డ్ సింగ్స్” ప్రసిద్ధి చెందింది. మాయా ఏంజెలో మహిళలు ఎదుర్కొనే కష్టాలను, పోరాటాలను చాలా అద్భుతంగా వివరించారు.
చిమమండ న్గోజీ అడిచీ
అడిచీ ఒక నైజీరియన్ రచయిత్రి. ఆమె నవలలు, చిన్న చిన్న కథలు, నాన్ స్టోరీలకు బాగా ప్రసిద్ధి. అడిచీ నవల ‘అమెరికానా’. నైజీరియాలోని తన ఇంటి నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఒక అమ్మాయి ప్రయాణం గురించిన కథ. ఈ పుస్తకం ఒక యువతి తన గుర్తింపు, ఊనికి కోసం చేసిన పోరాట అనుభవాలను రికార్డు చేసింది.
జూడీ స్మిత్
స్మిత్ ఒక ఆంగ్ల నవలా రచయిత. అలాగే చిన్న కథల రచయిత కూడా. ఆమె తొలి నవల ‘వైట్ టీత్’ బాగా అమ్ముడుపోయింది. అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ నవలలో యుద్ధం, వలస రాజ్యాల ఇతివృత్తాల గురించి నవల రూపంలో రికార్డు చేశారు. యుద్ధ సమయంలో మహిళలు, పిల్లలు ఎదుర్కోనే సమస్యల మీద కథలు ఉంటాయి.
అరుంధతీ రాయ్
అరుంధతీ రాయ్ భారతీయ రచయిత్రి. మానవ హక్కుల కార్యకర్త, ఉద్యమకారిణి. 1997లో ఆమె రాసిన ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అనే రచనలకు గాను బుకర్ ప్రైజు పొందిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. ప్రజల జీవితాలపై జరుగుతున్న చిన్న చిన్న అన్యాయాలను క్లుప్తంగా పరిశీలించి పొందుపరిచిన రచన. ‘ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్” అనే నవల కూడా పాఠకుల చేత ప్రశంసలు అందుకుంది.
నాడిన్ గోర్డిమర్
నాడిన్ దక్షిణాఫ్రికా రచయిత్రి, రాజకీయ కార్యకర్త. సాహిత్యంలో 1991 నోబెల్ బహుమతి పొందిన మహిళ రచయిత. ఆమె ‘మై సన్ స్టోరీ’ కథల పుస్తకం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ పుస్తకంలో రాజకీయ పోరాటాలు, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలోని వర్ణ వివక్ష గురించి, జాతి సమస్యలకు సంబంధించిన ఎన్నో విషయాలు దీంట్లో పొందుపరిచారు.






