30 June, 2026 | 11:57 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మహిళా పెట్రోల్ బంక్ ట్రయల్ సేల్ పరిశీలన

10-06-2025 12:36 AM

సంగారెడ్డి, జూన్ 9(విజయక్రాంతి): జిల్లాలో తొలిసారిగా సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మహిళా పెట్రోల్ బంక్ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు  సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోలు బంకును నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని పెట్రోల్ బంక్ మొట్ట మొదటిసారిగా మహిళల చేత నడిపించబడుతుందన్నారు.

సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ లో షెట్రోలు బంకు నిర్మాణం ఇప్పటికే పూర్తయిందిదని, మొత్తం 14 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని, అందులో ఇద్దరు మహిళలు మేనేజర్లుగా, పన్నెండు మంది మహిళలు ఆపరేటర్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. 

త్వరలోనే పెట్రోల్ బంకుకు సెక్యూరిటీ నియమిస్తామన్నారు. ట్రయ ల్ సేల్ అనంతరం వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా  కలెక్టర్ వాహనంలో డీజిల్ డీజిల్ పోయించుకొని తన సొంత డబ్బులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీ డిఆర్డిఒ జ్యోతి,  అదనపు డిఆర్డిఒ జంగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.