27 May, 2026 | 2:51 AM

మహిళలు స్వయం ఉపాధితో ఎదగాలి

27-05-2026 01:52 AM

శంకర్‌పల్లి మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్

శంకర్ పల్లి: మే 26( విజయ క్రాంతి): మహిళలు స్వయం ఉపాధితో ఎదగాలని శంకర్ పల్లి మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో మహిళా సంఘాల మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల లల్లో సభ్యత్వం లేని మహిళలతో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించారు.

కొత్త సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక సర్వే కార్యక్రమం నిర్వహించారు. గతంలో గ్రూపులలో ఉండి ప్రస్తుతం యాక్టివ్ లో లేని గ్రూపులను కూడా గుర్తించారు. ఆ గ్రూపులను ప్రత్యేకంగా పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రతి మహిళ కొత్త గ్రూపుల్లో చేరి ప్రభుత్వం తరఫున వస్తున్న రుణాలను పొంది స్వయం ఉపాధితో ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల మహిళలు పాల్గొన్నారు.