27 May, 2026 | 2:44 AM

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

27-05-2026 01:50 AM

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

కామారెడ్డి, మే 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో జూన్ 2న ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.

తాకావిష్కరణ, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల సందేశాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమర వీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించేల కార్యక్రమాలను రూపొందించాలన్నారు.

స్టేజీ, మైక్, సౌండ్, త్రాగునీరు, విద్యుత్, పార్కింగ్ లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఎదుగుతోందన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులను కోరారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్  విక్టర్, ఏ సి ఎల్ బి, ఎన్ వి.గిరి తదితరులు పాల్గొన్నారు.