11 March, 2026 | 2:25 AM

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి

11-03-2026 12:37 AM

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య 

సంగారెడ్డి, మార్చి 10: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పే ర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘ నంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య. టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించగలరన్నారు. ఒకప్పుడు కంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీసుల్లో మహిళా ఉద్యోగులు, ప్రజాసేవలో మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ముందుకు వస్తు న్నారని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటూ సమాజ అ భివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. టీజిఐఐసి చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలు, పు రుషులు సమానులని అన్నారు.

పిల్లలకు మొదటి గురువు తల్లేనని, ఆడ మగ అన్న తేడా లేకుండా పిల్లలను క్రమశిక్షణతో పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిపైనే ఉంటుందని పేర్కొన్నారు. సమాజం లో మార్పు రావాలంటే ముందుగా మహిళల్లోనే మార్పు రావాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరిట అందుతున్నాయని తెలిపారు. మహిళలు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా మహిళల రక్షణకు సంబంధించిన పలు చట్టాల గురిం చి ఆమె వివరించారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు మేమెంటో, సర్టిఫికెట్ అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొ న్న మహిళలకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్స న్ కూన వనిత సంతోష్ కుమార్,డిడబ్ల్యూఓ లలిత కుమారి, డిఆర్డీవో జ్యోతి, జిల్లా అధికారులు, డిఎంఅండ్హెచ్‌ఓ, సీడీపీవోలు, వివి ధ శాఖల మహిళా ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.