22-02-2026 12:19:24 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన జా తీయ ఆర్థిక సాక్షరత సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడా నికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలుపరుస్తున్నామని తెలిపా రు.
మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు ఎన్నో రంగా ల్లో ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. 46.68 లక్షల మహిళలు 4.37 లక్షల ఎస్‌హెచ్‌జీల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నా రని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతత్వంలోని ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని తెలిపారు.
మహిళల ఆర్థిక ప్రగతి ద్వారానే సమాజం ఆర్థికంగా పురోగమిస్తుంది అన్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్నా మని పేర్కొన్నారు. రెండేళ్లలో మహిళాసంఘాలకు రూ. 35,435కోట్ల బ్యాంకింగ్ రుణాల మంజూ రు చేశామని, ఇందిరా మహిళా శక్తితో 2.05 లక్షల సూక్ష్మ వ్యాపారాలను మహి ళా సంఘాలు స్థాపించాయని తెలిపారు.
మహిళా సంఘాలకు రూ. 1,121 కోట్ల్ల వడ్డీ మాఫీ
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు రూ. 1,121 కోట్ల్ల వడ్డీలను మాఫీ చేశామని, మహిళా స్వయం సహాయక సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యాపారాల్లో మహి ళా సంఘాలకు ప్రాధాన్యత నిస్తున్నామని చెప్పారు. సమ్మకేొ్కసారలమ్మ జాతరలో ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళా సంఘాలకు రూ.3.5కోట్లు లాభాలు వచ్చాయని,
మహిళా స్వయం సహాయక బృందాలకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్లు మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. జీడీపీలో మన దేశ మహిళల భాగస్వామ్యం 18 శాతమే నమోదయిందని, అదే అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భాగస్వామ్యం 40 శాతంగా ఉందని వివరించారు.
మహిళల వృద్ధితోనే దేశంలో ఆర్థిక వేగం పుంజుకుంటుందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకర్లు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మహిళా సాధికారతను మరింత వేగవంతం చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీతక్క ప్రసంగాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశంసించారు. సీతక్క ప్రసంగంలో మహిళా సాధికారత ప్రతిధ్వనిస్తోందని కొనియాడారు.