22-02-2026 12:21:53 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అగ్రికల్చర్ ఏడీఏ కిరణ్‌కుమార్
ఏడీఏ ఇల్లు, బంధువుల ఇళ్లలో..
ఏడుచోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు
వంద ఎకరాల భూమి, పది ప్లాట్లు, ఐదు కార్లు, ఐదు ట్రాక్టర్లు.. వీటి విలువ 50 కోట్లకు పైనే
నాగర్‌కర్నూల్/సూర్యాపేట, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి)/కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్ట ణంలో అగ్రికల్చర్ ఏడీఏ సుందరి కిరణ్‌కుమార్ ఆదా యానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించి శనివారం ఏడుచోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. సూర్యాపేట జిల్లాలోని తన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో మొత్తంగా ఏడుచోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.
సుమారు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిసింది. కిరణ్‌కుమార్ సూర్యాపేట జిల్లాలో ఐటీడీఏలో పీడీగా పనిచేసి, రెండు సంవత్సరాల క్రితం కల్వకుర్తికి ఏడీఏగా బదిలీపై వచ్చాడు. అయితే ఆదాయా నికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
కిరణ్‌కుమార్ సొంత ఊరు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు, అత్తగారి ఊరైన గడ్డిపల్లి, కూతురు గ్రామమైన అనంతగిరి మండలం అమీనాబాద్ తోపాటు తాను నివాసం ఉంటున్న సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఏడీఏ కార్యాలయంలో ఏకకాలంలో దాడులు జరిపి వివరాలు సేకరించారు. కిరణ్‌కుమార్ భాగ స్వామిగా నేరేడుచర్ల మం డలంలోని చిల్లేపల్లి గ్రామ శివారులోని అవని రైస్ మిల్లులో కూడా దాడులు నిర్వహించారు.
దాడులు నిర్వహిస్తున్న సమయంలో కిరణ్ కుమార్ పోనుగోడులోనే ఉన్నారు. వారు సేకరించిన వివరాల ప్రకా రం.. వంద ఎకరాల వ్యవసాయ పొలాలు, పది విలువైన ఇండ్ల ప్లాట్లు, ఐదు ఫోర్ వీలర్ వాహనాలు, ఐదు ట్రాక్టర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.15 కోట్లు అని చెపుతున్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం రూ.50 కోట్లకుపైనే ఉంటుందని అధికారులు అంచనావేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. కాగా ఏసీబీ అధికారులు కిరణ్‌కుమార్‌ను విచారణ నిమిత్తం వారి వెంట తీసుకెళ్లారు.