18 April, 2026 | 2:04 AM

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

05-06-2025 01:30 AM

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ 

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కష్టపడే వారికి పదవులు కచ్చితంగా వస్తాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయిలో పదవుల కూర్పుపై వెంటనే జాబితాను తయారు చేయాలని సూచించారు.

గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన బుధవారం జై భీమ్, జై బాపూ, జై సంవిధాన్ సమావేశం జరిగింది. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌తో పాటు కోఆర్డినేటర్లు, పీసీసీ అబ్జర్వర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యాచరణపై మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక సూచనలిచ్చారు. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై కోఆర్డినేటర్లు నివేదిక అందజేశారు.